Noro Virus: అమెరికాలో విజృంభిస్తున్న నోరో వైరస్..! 7 d ago
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, అమెరికాలో ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. నోరో వైరస్ ని స్టమక్ ఫ్లూ (STOMACH FLU) లేదా స్టమక్ బగ్ (STOMACH BUG) అని కూడా పిలుస్తారు. ఇది ఇన్ ఫ్లూయెంజా వైరస్ ద్వారా వచ్చే జ్వరం లాంటిది కాదు అని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (CDC) తెలిపింది. ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది.
నోరో వైరస్ లక్షణాలు..వాంతులు, విరేచనాలు, చలిజ్వరం, నీరసం, డీ హైడ్రేషన్, పొట్ట, పేగుల్లో తీవ్రమైన మంట (ACUTE GASTROENTERITIS). నోరోవైరస్ మొదటిసారిగా 1968లో అమెరికాలోని ఒహియోలోని నార్వాక్ లో ఒక పాఠశాలలో వ్యాప్తి చెందింది. ఈ కారణంగా నోరోవైరస్ యొక్క మొదటి జాతిని నార్వాక్ వైరస్ అని పిలుస్తారు. నోరోవైరస్లో అనేక రకాలున్నాయి. ఈ వైరస్లో 48 రకాలతో 10 సమూహాలు ఉన్నాయి. నోరోవైరస్ ఎంతో సాధారణమైనది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం సుమారు 685 మిలియన్ కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంచనా వేశారు.